దయగల యేసు పాపికాశ్రయుడా

DayagalaYesu Paapikaashrayudaa

Telugu by సీయోను గీతాలు

దయగల యేసు పాపికాశ్రయుడా

Dayagala Yesu Paapikaashrayudaa

ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము (2)

Priya Prabhu Drohini Karuninchumu (2)

1. ఓ ప్రభూ నీకు విరోధముగా

1. O Prabhoo Neeku Virodhamugaa

పాపము చేసిన దురితుండను (2)

Paapamu Chesina Durithundanu (2)

నీచుడనై నిన్ను వేధించితిన్

Neechudanai Ninnu Vedhinchithin

ఓ నాథా పాపిని క్షమించుము (2) ||దయగల||

O Naathaa Paapini Kshaminchumu (2) ||Dayagala||

2. లోకాశలన్నియు శోధించగా

2. Lokaashalanniyu Shodhinchagaa

నా కాయమంతయు క్షీణించెను (2)

Naa Kaayamanthayu KsheeninChenu (2)

నా కాశ్రయంబు నీవే ప్రభూ

Naa Kaashrayambu Neeve Prabhoo

ఓ నాథా పాపిని మన్నించుము (2) ||దయగల||

O Naathaa Paapini Manninchumu (2) ||Dayagala||

3. నా ధనము ఘనము నా సర్వము

3. Naa Dhanamu Ghanamu Naa Sarvamu

నా దేవా పాపముకై వ్యయపరచితిన్ (2)

Naa Devaa Paapamukai Vyayaparachithin (2)

ఓ దేవా నేను రిక్తుండను

O Devaa Nenu Rikthundanu

నా దురితంబులను బాపుమా (2) ||దయగల||

Naa Durithambulanu Baapumaa (2) ||Dayagala||

4. అందరు నాకు బంధువులని

4. Andaru Naaku Bandhuvulani

ఎందరో స్నేహంబు చేసిరి (2)

Endaro Snehamu Chesiri (2)

అందరు నన్ను విడువంగను

Andaru Nannu Viduvanganu

నా తండ్రీ నా కాశ్రయంబిమ్ము (2) ||దయగల||

Naa Thandree Naa Kaashrayambimmu (2) ||Dayagala||

5. మరుగైన నాదు పాపంబులకు

5. Marugaina Naadu Paapambulaku

నరకంబు నాకు సరియైనది (2)

Narakambu Naaku Sariyainadi (2)

నీ రక్తముతో కడుగుమా

Nee Rakthamutho Kadugumaa

మరి నాకు దిక్కెవరు ఓ యేసువా (2) ||దయగల||

Mari Naaku Dikkevaru O Yesuvaa (2) ||Dayagala||

6. ఈ నాడే నీ మాట నేవిందును

6. Ee Naade Nee Maata Nevintunu

ఎన్నడు నిన్ను విడువను (2)

Ennadu Ninnu Viduvanu (2)

ఈ నాడే నన్ను క్షమించుము

Ee Naade Nannu Kshaminchumu

నా పేరు గ్రంథమందు వ్రాయుము (2) ||దయగల||

Naa Peru Granthamandu Vraayumu (2) ||Dayagala||

Related Telugu Christian Songs