దప్పిగొనిన వారలారా

Dappigonina Vaaralaaraa

Telugu by సీయోను గీతాలు

దప్పిగొనిన వారలారా

Dappigonina Vaaralaaraa

దప్పి తీర్చుకొన రండి రండి (2)

Dappi Theerchukona Randi Randi (2)

కాసు రూకలు లేకున్నను

Kaasu Rookalu Lekunnanu

త్రాగను రండి (2) ||దప్పి||

Thraaganu Randi (2) ||Dappi||

1. యెషయా యిరువదియైదు

1. Yeshayaa Yiruvadiyaidu

ఆరవ వచనము చదివి (2)

Aarava Vachanamu Chadivi (2)

త్రాగుచు తృప్తి పొందను

Thraaguchu Thrupthi Pondanu

రండి రండి (2) ||దప్పి||

Randi Randi (2) ||Dappi||

2. క్రొవ్విన పదార్థమును

2. Krovvina Padaarthamunu

పాత ద్రాక్షారసమును (2)

Paatha Draakshaarasamunu (2)

క్రొవ్వు మెదడు గలవాటిని

Krovvu Medadu Galavaatini

తినుటకు రండి (2) ||దప్పి||

Thinutaku Randi (2) ||Dappi||

3. నేనే జీవపానమును

3. Nene Jeevapaanamunu

నేనే పరమాహారమును (2)

Nene Paramaahaaramunu (2)

రూకలను వ్యర్థము చేయక

Rookalanu Vyarthamu Cheyaka

రండి రండి (2) ||దప్పి||

Randi Randi (2) ||Dappi||

4. నా శరీరమే పరమాహారం

4. Naa Shareerame Paramaahaaram

నే చిందించిన రక్తమేపానం (2)

Ne Chindinchina Rakthame Paanam (2)

తిని త్రాగిన వారికి కల్గును

Thini Thraagina Vaariki Kalgunu

నిత్యజీవం (2) ||దప్పి||

Nithyajeevam (2) ||Dappi||

5. ద్రాక్షారసము ఓదార్చున్

5. Draakshaarasamu OdaarChun

జల్దరు తృప్తిపరచున్ (2)

Jaldaru Thrupthiparachun (2)

నీకు నూనె ఉజ్జీవము

Neeku Noone Ujjeevamu

నిచ్చున్నిచ్చున్ (2) ||దప్పి||

Nichchunnichchun (2) ||Dappi||

6. గొఱ్ఱెపిల్లలు దూడలును

6. GorrePillalu Doodalunu

తినువారికి చంపబడెను (2)

ThinuVaariki Champabadenu (2)

వ్యర్థసాకులను చెప్పక

Vyartha Saakulanu Cheppaka

రండి రండి (2) ||దప్పి||

Randi Randi (2) ||Dappi||

7. సర్వసమృద్ధిలోన

7. Sarvasamruddhilona

దేవుడున్నాడు రండి (2)

Devudunnaadu Randi (2)

హల్లెలూయ పాటలుండును

Hallelooya Paatalundunu

రండి రండి (2) ||దప్పి||

Randi Randi (2) ||Dappi||

Related Telugu Christian Songs