దైవ ప్రేమ పృథ్విలోని
Daiva Prema Pruthviloni
1. దైవ ప్రేమ పృథ్విలోని
1. Daiva Prema Pruthviloni
యన్నిటిని మించును
Yannitini Minchunu
యేసు మాలో నివసించు
Yesu Maalo Nivasinchu
యది మా విముక్తియే
Yadi Maa Vimukthiye
నీ కమూల్య ప్రేమ యుండు
Nee Kamoolya Prema Yundu
నీవు దాసుల మైన మమ్ముం
Neevu Daasula Maina Mammun
కృపతో రక్షించుము
Krupatho Rakshinchumu
2. మమ్ము సంరక్షించు శక్తి
2. Mammu Sanrakshinchu Shakthi
నీకుండు, మా ప్రభువా
Neekundu, Maa Prabhuvaa
ఎన్నం డెన్నం దేని నీదు
Ennan Dennan Deni Needu
సన్నిధిని బాయుము
Sannidhini Baayumu
నిన్ స్తుతించుచుండి మేము
Nin Sthuthinchuchundi Memu
సర్వదా సేవింతుము
Sarvadaa Sevinthumu
నిన్ ప్రార్థించి పూర్ణప్రేమ
Nin Praarthinchi Poornaprema
మే మతిశయింతుము
Me Mathishayinthumu
3. క్రొత్తగా మమ్ము సృజించి
3. Kroththagaa Mammu Srujinchi
పాప మెల్లం బాపుము
Paapa Mellan Baapumu
మాకు స్వస్థత నొసంగి
Maaku Svasthatha Nosanggi
గొప్ప రక్షం జూపుము
Goppa Rakshan Joopumu
భక్తి యభివృద్ధి పొంది
Bhakthi Yabhivruddhi Pondi
స్వర్ణమందుం జేరగా
Svarnamandun Jeragaa
వింత నొంది ప్రేమ స్తుతి
Vintha Nondi Prema Sthuthi
నీకర్చింతు మెప్పుడు
Neekarchinthu Meppudu