చూడ గోరెద
Chooda Goreda
చూడ గోరెద - దేవ - మందిరావరణములను - చూడ గోరెద = చూడ
Chooda Goreda - Deva - Mandiraavaranamulanu - Chooda Goreda = Chooda
నాకు నాశ గలదు - సుందరావరణము లవి = చూడ నాదు ప్రాణమెంతో -
Naaku Naasha Galadu - Sundaraavaranamu Lavi = Chooda Naadu Praanamentho -
సొమ్మసిల్లుచున్నదహా ||చూడ||
Sommasilluchunnadahaa ||Chooda||
1. నీదు నివాసములు జూడ - నెంతో రమ్యమై తనర = నాదు హృదయమునకు
1. Needu Nivaasamulu Jooda - Nentho Ramyamai Thanara = Naadu Hrudayamunaku
నా - నంద మిచ్చు నిపుడు నెపుడు ||చూడ||
Naa - Nanda Michchu Nipudu Nepudu ||Chooda||
2. జీవము గల ప్రభుని జూడ - జీవి నాలో కేక వేసె = కోవెలలకు దొరికె
2. Jeevamu Gala Prabhuni Jooda - Jeevi Naalo Keka Vese = Kovelalaku Dorike
గూటి - తావు నీ మందిరమున ||చూడ||
Gooti - Thaavu Nee Mandiramuna ||Chooda||
3. పిచ్చుకలకు దొరికె స్థలము - ముచ్చట బలిపీఠ మెదుట = పెట్టు
3. Pichchukalaku Dorike Sthalamu - Muchchata Balipeetha Meduta = Pettu
కుతూహలముతోను - పిల్లల నవి మందిరమున ||చూడ||
Kuthoohalamuthonu - Pillala Navi Mandiramuna ||Chooda||
4. నీదు మందిరంబులోన - నిత్యవాసులైనవారు = నిక్కముగను ధన్యులగుచు
4. Needu Mandirambulona - Nithyavaasulainavaaru = Nikkamuganu Dhanyulaguchu
- నిన్ను నన్నుతింతు రహో ||చూడ||
- Ninnu Nannuthinthu Raho ||Chooda||
5. ప్రభుని వలన బలము నొందు - ప్రజలు ధన్యులగుదు రిల = ప్రాణ
5. Prabhuni Valana Balamu Nondu - Prajalu Dhanyulagudu Rila = Praana
ప్రియము యాత్ర సేయు ప్రజల మార్గ మమర ధరను ||చూడ||
Priyamu Yaathra Seyu Prajala Maarga Mamara Dharanu ||Chooda||
6. నీదు యావరణములలో - నేను నొక్క దినము గడుప = నెంతో విలువ గల
6. Needu Yaavaranamulalo - Nenu Nokka Dinamu Gadupa = Nentho Viluva Gala
నాకు - వేరినాళ్లు బ్రతుకు కన్న ||చూడ||
Naaku - Verinaallu Brathuku Kanna ||Chooda||
7. కానరండు మనము నిపుడే - మనము లలర ప్రభుని జూడ = మందిరమున
7. Kaanarandu Manamu Nipude - Manamu Lalara Prabhuni Jooda = Mandiramuna
కేగి నిండు - మనశ్శాంతి బొంది బ్రతుక ||చూడ||
Kegi Nindu - Manashshaanthi Bondi Brathuka ||Chooda||