చేరి భుజియింపుడీ విందు

Cheri Bhujiyimpudee Vindu

Telugu by వి.డి. జాన్ సుందరరావు • andhra-kraisthava-keerthanalu

చేరి భుజియింపుడీవిందు - యేసు - సిద్ధపరచిన కృపావిందు = తోరణంబగు

Cheri Bhujiyimpudeevindu - Yesu - Siddhaparachina Krupaavindu = Thoranambagu

మేడ గదిలో - జేరి శిష్యుల తోడ సిలువ = భారమున్‌ మదినెంచి నెరపిన -

Meda Gadilo - Jeri Shishyula Thoda Siluva = Bhaaramun Madinenchi Nerapina -

భావ

Bhaava

గర్భితమైన విందు ||చేరి||

Garbhithamaina Vindu ||Cheri||

1. జీవాహారము దైవసుతుడే - పరమ - జీవజలముల దాత యితడే =

1. Jeevaahaaramu Daivasuthude - Parama - Jeevajalamula Daatha Yithade =

జీవనాధుని రక్త - మేనులు - జీవానాహారములు కాగా = చావును దొల గించి

Jeevanaadhuni Raktha - Menulu - Jeevaanaahaaramulu Kaagaa = Chaavunu Dola Ginchi

మృతులస - జీవులనుగా మార్చువిందు చేరి!

Mruthulasa - Jeevulanugaa Maarchuvindu Cheri!

2. _ కారుణ్యనిధి యేసు రాజు - నరుల - గావగ బలియైన రోజు = భారమైన

2. _ Kaarunyanidhi Yesu Raaju - Narula - Gaavaga Baliyaina Roju = Bhaaramaina

సిలువ కెరయై - పాప భారము పరిహరింప = ధారవోసిన పుణ్యరక్తపు -

Siluva Kerayai - Paapa Bhaaramu Pariharimpa = Dhaaravosina Punyarakthapu -

ధారలన్‌ దలపోయు విందు ||1చేరి||

Dhaaralan Dalapoyu Vindu ||1Cheri||

3. _దాసగణముల బ్రోవనెంచి - రుధిర - ధారలను గార్చిభరించి = భాసు

3. _Daasaganamula Brovanenchi - Rudhira - Dhaaralanu Gaarchibharinchi = Bhaasu

రంబగు నవ నిబంధన - జేసి సంఘ పునాది వేసి = వాసి మారగ నిత్య

Rambagu Nava Nibandhana - Jesi Sanggha Punaadi Vesi = Vaasi Maaraga Nithya

జీవము - బోసినట్టి యేసు విందు ||చేరి||

Jeevamu - Bosinatti Yesu Vindu ||Cheri||

4. పాప పరిహారార్థముకై - క్రీస్తు - పడిన ఘఫోరబాధ కొరకై = యేపు దనరగ

4. Paapa Parihaaraarthamukai - Kreesthu - Padina Ghaphorabaadha Korakai = Yepu Danaraga

స్తుతులుబాడుచు - యేసునాధుని రాకవరకు = ఆపకుండగ సత్ర్రసాదము -

Sthuthulubaaduchu - Yesunaadhuni Raakavaraku = Aapakundaga Sathrrasaadamu -

నందుకొని బలమొంద రండి 11చేరి||

Nandukoni Balamonda Randi 11Cheri||

5. _ విందుతో మొదలిడిన సేవ - యేసు - విందుతో ముగియించె బ్రోవ =

5. _ Vindutho Modalidina Seva - Yesu - Vindutho Mugiyinche Brova =

విందులోగల మర్శ్మమేదియొ - విపులముగ బోధించు క్రీస్తున్‌ = డెందమున

Vindulogala Marshmamediyo - Vipulamuga Bodhinchu Kreesthun = Dendamuna

ధ్యానించి యాయన - యందె నమ్మిక గలిగియుందము చేరి!

Dhyaaninchi Yaayana - Yande Nammika Galigiyundamu Cheri!

Related Telugu Christian Songs