భూమి ఆకాశము నీవే

Bhoomi Aakaashamu Neeve

Telugu by డి.వి.దానియల్‌ • andhra-kraisthava-keerthanalu

సృష్టిపితా - సర్వోన్నతా = సమర్పింతున్ - సర్వస్వమున్

Srushtipithaa - Sarvonnathaa = Samarpinthun - Sarvasvamun

1. భూమి ఆకాశము నీవే - భూధర శిఖరములు నీవే = భూ ప్రజలు నీవారే -

1. Bhoomi Aakaashamu Neeve - Bhoodhara Shikharamulu Neeve = Bhoo Prajalu Neevaare -

బలశౌర్యములు నీవే ||సృష్టి||

Balashauryamulu Neeve ||Srushti||

2. మా వెండి బంగారములు నీవే - మాకున్న వరములు నీవే = మా దేహముల్‌ -

2. Maa Vendi Banggaaramulu Neeve - Maakunna Varamulu Neeve = Maa Dehamul -

మా గేహముల్‌ మా జీవితము నీవే ||సృష్టి||

Maa Gehamul Maa Jeevithamu Neeve ||Srushti||

3. వెలలేని గాలి వెలుతురులు - విలువైన పాడి పైరులు = వివిధంబులైన

3. Velaleni Gaali Veluthurulu - Viluvaina Paadi Pairulu = Vividhambulaina

దీవెనలు - నీ కరుణా వర్షములు ||సృష్టి||

Deevenalu - Nee Karunaa Varshamulu ||Srushti||

4. పరిశుద్ధ గ్రంథపు పలుకులు - పరలోక తేనె చినుకులు = ప్రభు యేసుని

4. Parishuddha Granthapu Palukulu - Paraloka Thene Chinukulu = Prabhu Yesuni

మాటలు - మా వెల్గు బాటలు ||సృష్టి||

Maatalu - Maa Velgu Baatalu ||Srushti||

5. మాదంత నీదే మహా దేవా - మా రాజువయ్యా యెహోవా = మా తనువుల్‌

5. Maadantha Neede Mahaa Devaa - Maa Raajuvayyaa Yehovaa = Maa Thanuvul

మా బ్రతుకుల్ మా యావదాస్తి నీవే ||సృష్టి||

Maa Brathukul Maa Yaavadaasthi Neeve ||Srushti||

6. మేమిచ్చు కాన్క యేపాటిది? యే ప్రేమ నీకు సాటిది? = మోక్ష నాధా

6. Memichchu Kaanka Yepaatidi? Ye Prema Neeku Saatidi? = Moksha Naadhaa

యేసుప్రభో - అంగీకరించువిభో ||సృష్టి||

Yesuprabho - Anggeekarinchuvibho ||Srushti||

7. తండ్రి కుమార శుద్ధాత్ముడా - త్రియేక దేవ స్తోత్రముల్‌ = దాత వీవే నేతవీవే

7. Thamdri Kumaara Shudhdhaathmudaa - Thriyeka Deva Sthothramul = Daatha Veeve Nethaveeve

- దేవాది దేవుండవే ||సృష్టి||

- Devaadi Devundave ||Srushti||

Related Telugu Christian Songs