భూమండలము దాని సంపూర్ణత

Bhoomandalamu Daani Sampoornatha

Telugu by మల్లెల దావీదు • andhra-kraisthava-keerthanalu

భూమండలము దాని సం - పూర్ణత యును లోకమును = భూమండల

Bhoomandalamu Daani San - Poornatha Yunu Lokamunu = Bhoomandala

వాసులను - బోల్పార యెహోవావే ||భూ||

Vaasulanu - Bolpaara Yehovaave ||Bhoo||

1. యెహోవ సముద్రము మీద - భూమి పునాది వేసె = మహాజలముల మీద

1. Yehova Samudramu Meeda - Bhoomi Punaadi Vese = Mahaajalamula Meeda

- మనదేవుడది స్థిరపర్చె ||భూ||

- Manadevudadi Sthiraparche ||Bhoo||

2. యెహోవ పర్వతమునకు - నెక్కంగ పాత్రు డెవడు = మహాలయంబునందు

2. Yehova Parvathamunaku - Nekkanga Paathru Devadu = Mahaalayambunandu

- మరి నిల్వ యోగ్యుండు డెవడు ||భూ||

- Mari Nilva Yogyundu Devadu ||Bhoo||

3. అపవిత్ర మనసులేక - కపట ప్రమాణము లేక = సుపవిత్రమౌ చేతులను -

3. Apavithra Manasuleka - Kapata Pramaanamu Leka = Supavithramau Chethulanu -

శుద్ధాత్మ గల్గినవాడే ||భూ||

Shuddhaathma Galginavaade ||Bhoo||

4. ఆలాటి వాడు ప్రభుని యాశీర్వచనము నొందు = భూలోకమున రక్షణ

4. Aalaati Vaadu Prabhuni Yaasheervachanamu Nondu = Bhoolokamuna Rakshana

దేవుని నీతి మత్వముపొందు ||భూ||

Devuni Neethi Mathvamupondu ||Bhoo||

5. ప్రభునాశ యుంచు నట్టి - వారు యాకోబు దేవ = ప్రభుసన్నిధానము

5. Prabhunaasha Yunchu Natti - Vaaru Yaakobu Deva = Prabhusannidhaanamu

వెదకు - ప్రజలెల్ల రట్టివారే ||భూ||

Vedaku - Prajalella Rattivaare ||Bhoo||

6. ద్వారంబు లార యుంచ మీ తల లెత్తెత్త వలెన్ = రాజుల కొరకుతలుపు

6. Dvaarambu Laara Yuncha Mee Thala Leththeththa Valen = Raajula Korakuthalupu

- లారా మిమ్మెత్తుకొనుండి ||భూ||

- Laaraa Mimmeththukonundi ||Bhoo||

7. ఇలలో మహా మహిమంబు - గల్గిన యా రాజెవడు = బలశౌర్య

7. Ilalo Mahaa Mahimambu - Galgina Yaa Raajevadu = Balashaurya

ముల యెహోవా - బహుశూరుడా యెహోవా ||భూ||

Mula Yehovaa - Bahushoorudaa Yehovaa ||Bhoo||

Related Telugu Christian Songs