భయపడను
Bhayapadanu
మహోన్నతుడా నీ చాటున నే నివసించెదను
Mahonnathudaa Nee Chaatuna Ne Nivasinchedanu
సర్వశక్తుడా నీ నీడలో నే విశ్రమించెదను
Sarvashakthudaa Nee Needalo Ne Vishraminchedanu
బలవంతుడా నీ సన్నిధినే
Balavanthudaa Nee Sannidhine
నే ఆశ్రయించెదా అనుదినము (2)
Ne Aashrayinchedaa Anudinamu (2)
యేసయ్యా యేసయ్యా (2)
Yesayyaa Yesayyaa (2)
1. రాత్రివేళ కలుగు భయముకైనా
1. Raathrivela Kalugu Bhayamukainaa
పగటిలో ఎగిరే బాణముకైనా
Pagatilo Egire Baanamukainaa
చీకటిలో సంచరించు తెగులుకైనా
Cheekatilo Sancharinchu Thegulukainaa
దినమెల్లా వేధించు వ్యాధికైనా
Dinamellaa Vedhinchu Vyaadhikainaa
నే భయపడను నే దిగులు చెందను
Ne Bhayapadanu Ne Digulu Chendanu
యెహోవా రాఫా నా తోడు నీవే (2)
Yehovaa Raaphaa Naa Thodu Neeve (2)
యేసయ్యా యేసయ్యా (2)
Yesayyaa Yesayyaa (2)
2. వేయిమంది నా ప్రక్క పడిపోయినా
2. Veyimandi Naa Prakka Padipoyinaa
పదివేలు నా చుట్టు కులిననూ
Padivelu Naa Chuttu Kulinanoo
అంధకారమే నన్ను చుట్టుముట్టినా
Andhakaarame Nannu Chuttumuttinaa
మరణ భయమే నన్ను వేధించినా
Marana Bhayame Nannu Vedhinchinaa
నే భయపడను నే దిగులు చెందను
Ne Bhayapadanu Ne Digulu Chendanu
యెహోవా నిస్సి నా తోడు నీవే (2)
Yehovaa Nissi Naa Thodu Neeve (2)
యేసయ్యా యేసయ్యా (2)
Yesayyaa Yesayyaa (2)
నిను ప్రేమించువారిని తప్పించువాడా
Ninu Preminchuvaarini Thappinchuvaadaa
నిన్నెరిగిన వారిని ఘనపరచువాడా (4)
Ninnerigina Vaarini Ghanaparachuvaadaa (4)
నా యుద్ధము జయించి లేవనెత్తువాడా
Naa Yuddhamu Jayinchi Levanetthuvaadaa
కృప వెంబడి కృప చూపించువాడా (2)
Krupa Vembadi Krupa Choopinchuvaadaa (2)
యేసయ్యా యేసయ్యా (2)
Yesayyaa Yesayyaa (2)
నే భయపడను నే దిగులు చెందను
Ne Bhayapadanu Ne Digulu Chendanu
యెహోవా షాలోం నా తోడు నీవే
Yehovaa Shaalom Naa Thodu Neeve