భారమైనది సేవ

Bhaaramainadi Seva

Telugu by కేసానవల్లి అబ్రవోము • andhra-kraisthava-keerthanalu

దారి - చేరి నడచెడివారిన్‌ జేరి వారితో - సంప్రదించి ప్రభువును చూపి -

Daari - Cheri Nadachedivaarin Jeri Vaaritho - Sampradinchi Prabhuvunu Choopi -

ఘోరనరకపు బాధలన్నియు - కూర్మితో వినజెప్పి - మోక్షపు - దారికిని -

Ghoranarakapu Baadhalanniyu - Koormitho Vinajeppi - Mokshapu - Daarikini -

నడిపించి - యేసుని - దాపునకు నడిపించుదారి ||

Nadipinchi - Yesuni - Daapunaku Nadipinchudaari ||

1. దురితదుర్గతి నశియించు వారినిజూచి - పరితాప - మొందవలయున్‌ =

1. Durithadurgathi Nashiyinchu Vaarinijoochi - Parithaapa - Mondavalayun =

మారమనసు నొంది - చేరి ప్రభునితో కలిసి - ఘోరపాపిని నేనని - వేడి -

Maaramanasu Nondi - Cheri Prabhunitho Kalisi - Ghorapaapini Nenani - Vedi -

సిలువ ధ్యానించి = దురితములను - చేయనని తీర్మానములను చేసికొని -

Siluva Dhyaaninchi = Durithamulanu - Cheyanani Theermaanamulanu Chesikoni -

రక్షింపబడినది గురుతుగ సాక్ష్యంబునిచ్చుటయే దారి ||

Rakshimpabadinadi Guruthuga Saakshyambunichchutaye Daari ||

2. ప్రథమ దశభాగంబుల - ప్రభునకు నిచ్చి - ప్రతిదినము ప్రార్ధింప వలెన్‌ =

2. Prathama Dashabhaagambula - Prabhunaku Nichchi - Prathidinamu Praardhimpa Valen =

అధములగు - బీదలకు నాధారముల నొసగి -విధిగ భక్తుల - నాదరించి -

Adhamulagu - Beedalaku Naadhaaramula Nosagi -Vidhiga Bhakthula - Naadarinchi -

సవరించి = ప్రభువు వాక్యము - చదువుకొనుచు - ప్రభుని పాటలు పాడుకొనుచు

Savarinchi = Prabhuvu Vaakyamu - Chaduvukonuchu - Prabhuni Paatalu Paadukonuchu

- ప్రభుని వేదము ప్రచురపరచి - పదిలముగ - జీవించకోరి ||

- Prabhuni Vedamu Prachuraparachi - Padilamuga - Jeevinchakori ||

8. _ దేశదేశముల తిరిగి - దేవుని వాక్యము - దేశప్రజలకు చాటవలెన్‌ =

8. _ Deshadeshamula Thirigi - Devuni Vaakyamu - Deshaprajalaku Chaatavalen =

ఆశాదురాశలను - కోసివేసి యేసు - దాసులను జేసి - వెలిగించి తిలకించి =

Aashaaduraashalanu - Kosivesi Yesu - Daasulanu Jesi - Veliginchi Thilakinchi =

యేసుభక్తుల పదిలపరచి యేసుతో - పరిచయము చేసి - యేసును ధరియింప

Yesubhakthula Padilaparachi Yesutho - Parichayamu Chesi - Yesunu Dhariyimpa

జేసి - యేసుతో నివసించుదారి ||

Jesi - Yesutho Nivasinchudaari ||

Related Telugu Christian Songs