బాలకా నీ వర్తనము

Baalakaa Nee Varthanamu

Telugu by దానరి మోజెస్ • andhra-kraisthava-keerthanalu

బాలకా నీ వర్తనము గా - పాడుకొని జీవింపరా మేలులుకుం బలు కీడు

Baalakaa Nee Varthanamu Gaa - Paadukoni Jeevimparaa Melulukun Balu Keedu

లకునదె - మూలమనిగమనింపరా ||బాలకా||

Lakunade - Moolamanigamanimparaa ||Baalakaa||

1. తప్పినడువకు మెన్నుడేని - తల్లిదండ్రుల యానతి - తప్పిపోయిన సుతుండు

1. Thappinaduvaku Mennudeni - Thallidandrula Yaanathi - Thappipoyina Suthundu

పడిన - తిప్పలు నీ వెఱుంగవా? ||బాలకా||

Padina - Thippalu Nee Verungavaa? ||Baalakaa||

2. గోలచేయుచుం బెద్దలనుగని - మేలమాడుట తగదురా - బాలురా యెలిషాను

2. Golacheyuchum Beddalanugani - Melamaaduta Thagaduraa - Baaluraa Yelishaanu

నవ్వి - ప్రాణగొడ్డమునొందరే ||బాలకా||

Navvi - Praanagoddamunondare ||Baalakaa||

3. పరులకెగ్గొనరింపంబోకుము - దొరలునదినీ మీందనే - పరునికై హామాను

3. Parulakeggonarimpambokumu - Doralunadinee Meendane - Parunikai Haamaanu

నిల్పిన - కొఱంత నతండే వ్రేలండే ||బాలకా||

Nilpina - Korantha Nathande Vrelande ||Baalakaa||

4. కట్టండి కార్యంబుతుదకుం - బట్టి కుడుపకపోదురా - మిట్టిపడిన రాణి

4. Kattandi Kaaryambuthudakun - Batti Kudupakapoduraa - Mittipadina Raani

యెజెబె - లెట్టులీల్గెనో తెలియదా? ||బాలకా||

Yejebe - Lettuleelgeno Theliyadaa? ||Baalakaa||

5. వగవకుము పరధనముంగనియది - తెగులులేని బాధరా - సుగతిగనెనె

5. Vagavakumu Paradhanamungganiyadi - Thegululeni Baadharaa - Sugathiganene

యాహాబుతా - శునకముల కాహారమై? ||బాలకా||

Yaahaabuthaa - Shunakamula Kaahaaramai? ||Baalakaa||

6. ఆన్యతంబులాడకుము దే - హాంతమైన నేమిరా? - ఆన్యతము చేనని యాతన

6. Aanyathambulaadakumu De - Haanthamaina Nemiraa? - Aanyathamu Chenani Yaathana

- యాలితో సహకూలండే ||బాలకా||

- Yaalitho Sahakoolande ||Baalakaa||

7. కోపమునకాస్పదమునీయం - గోరకుము మదినెన్నుడు - కోప జ్వాలలు

7. Kopamunakaaspadamuneeyan - Gorakumu Madinennudu - Kopa Jvaalalu

పెంచికయ్యును - గోడు చెందడె హంతయై ||బాలకా||

Penchikayyunu - Godu Chendade Hanthayai ||Baalakaa||

8. తులువల జత గూడిమాడి - చెలిమిచేయుట తగదురా - పలువల

8. Thuluvala Jatha Goodimaadi - Chelimicheyuta Thagaduraa - Paluvala

సాంగత్యమున రెహ - బాము భంగము నొందండే ||బాలకా||

Saanggathyamuna Reha - Baamu Bhanggamu Nondande ||Baalakaa||

9. బాలుడా నీ తరుణ హృదయము - ప్రభున కప్పగింపరా - శీల సౌష్టవ

9. Baaludaa Nee Tharuna Hrudayamu - Prabhuna Kappagimparaa - Sheela Saushtava

మొదవునీ కా - శీస్సులును జేకూరురా ||బాలకా||

Modavunee Kaa - Sheessulunu Jekooruraa ||Baalakaa||

Related Telugu Christian Songs