అయ్యో నాదగు ఘోరపాపము
Ayyo Naadagu Ghorapaapamu
అయ్యో నాదగు ఘోరపాపము గదా - భారమై నీపై నొరిగె = నెయ్యము
Ayyo Naadagu Ghorapaapamu Gadaa - Bhaaramai Neepai Norige = Neyyamu
వీడి మెస్సీయ్య నిన్ సిలువ - కొయ్యపైని గొరత కప్పగించిన ||దయ్యో||
Veedi Messeeyya Nin Siluva - Koyyapaini Goratha Kappaginchina ||Dayyo||
1... నిరతము దూతానీక మూడిగము - నెరపుచుండం దండ్రి పజ్జనుండియు =
1... Nirathamu Doothaaneeka Moodigamu - Nerapuchundan Dandri Pajjanundiyu =
నిరుపమాన సౌఖ్యములం దేలు నినుం - బరమునుండి క్రిందికి దిగలాగిన
Nirupamaana Saukhyamulan Delu Ninun - Baramunundi Krindiki Digalaagina
||దయ్యో||
||Dayyo||
2... కోరి నిన్నుం గడుపారం గనియుం గను - లారం చూచుకొన నేరనట్టి యల
2... Kori Ninnun Gadupaaran Ganiyun Ganu - Laaran Choochukona Neranatti Yala
= మేరి గర్భమున దూయంబడిన కడు - ఘోరమైన ఖడ్గంబు నిజముగ ||నయ్యో||
= Meri Garbhamuna Dooyambadina Kadu - Ghoramaina Khadgambu Nijamuga ||Nayyo||
3. మొయ్యరాని పెనుకొయ్య నొండు నీ - మూపుపైన భారముగ మోపి =
3. Moyyaraani Penukoyya Nondu Nee - Moopupaina Bhaaramuga Mopi =
రయ్యయ్యొ యింత బాధ సల్పినది యూ - దయ్య వాసులెంత మాత్రమునుగా
Rayyayyo Yintha Baadha Salpinadi Yoo - Dayya Vaasulentha Maathramunugaa
||రయ్యో||
||Rayyo||
4. కోలలచే నెన్నెన్నా పెట్లు పెను - గోలగాక యెన్నెన్నా తిట్లు కృప = మాలి
4. Kolalache Nennennaa Petlu Penu - Golagaaka Yennennaa Thitlu Krupa = Maali
నీదు వదనమ్ముపై నుమియ -నేల నింత కోపంబురాదు నిజ ||మయ్యో||
Needu Vadanammupai Numiya -Nela Nintha Kopamburaadu Nija ||Mayyo||
5. _ ముండ్లతోడ మకుట మొక్క టల్లి కడు - మూర్ధత నీ తలపైనిం బెట్టి నీ =
5. _ Mundlathoda Makuta Mokka Talli Kadu - Moordhatha Nee Thalapainin Betti Nee =
కండ్ల కొక్క గంతం గడ - గండు పెట్టం గారణము నిజముగా ||;నయ్యో||
Kandla Kokka Ganthan Gada - Gandu Pettan Gaaranamu Nijamugaa ||;Nayyo||
6. _ ఈవు ప్రాణమును నీవిగ నొసంగ - నీటెతోడం బ్రక్కను బొడుచుట హా =
6. _ Eevu Praanamunu Neeviga Nosangga - Neetethodan Brakkanu Boduchuta Haa =
భావమందుం దలపోసి చూడ నల - బంటు గాదు బల్లెంబు గాదు నిజ
Bhaavamandun Dalaposi Chooda Nala - Bantu Gaadu Ballembu Gaadu Nija
||మయ్యో||
||Mayyo||