అపు డర్చకాదు లుప్పొంగిరి

Apu Darchakaadu Lupponggiri

Telugu by పురుషోత్తము చౌధరి • andhra-kraisthava-keerthanalu

అపు డర్చకాదు లుప్పొంగిరి - ప్రభుని - విపరీతముగం జంపసాగిరి =

Apu Darchakaadu Lupponggiri - Prabhuni - Vipareethamugan Jampasaagiri =

కృపమాలినట్టి పా - పపు జిత్తమున నిష్టు - రపు సిల్వమానిపైం - బ్రభుని

Krupamaalinatti Paa - Papu Jiththamuna Nishtu - Rapu Silvamaanipain - Brabhuni

వేయుట కొప్పి రపు డర్చ||

Veyuta Koppi Rapu Darcha||

1. యెరూషలేమను నూరి బైటను - దుఃఖ - కరమైన కల్వరిమెట్టను = పరమ

1. Yerooshalemanu Noori Baitanu - Duhkha - Karamaina Kalvarimettanu = Parama

సాధుని సిల్వ - పైం బెట్టి తత్పాద - కరమధ్యముల మేకు - లరుదుగ దిగం

Saadhuni Silva - Pain Betti Thathpaada - Karamadhyamula Meku - Laruduga Digan

గొట్టి రపు డర్చ||

Gotti Rapu Darcha||

2... చిమ్మె నిమ్మగు మేని రక్తము - దాని - నమ్ము వారల కెంతో యుక్తము =

2... Chimme Nimmagu Meni Rakthamu - Daani - Nammu Vaarala Kentho Yukthamu =

నెమ్మోము వాడి కెం - దమ్మి పూవలె మస్త -కమ్ము వేటులను ర - క్తము జారి

Nemmomu Vaadi Ken - Dammi Poovale Mastha -Kammu Vetulanu Ra - Kthamu Jaari

కనుపట్టె ||నపు డర్చ||

Kanupatte ||Napu Darcha||

3... గడి దొంగ లిరువురుని బట్టిరి - ప్రభుని - కుడి యెడమలను సిల్వం

3... Gadi Dongga Liruvuruni Battiri - Prabhuni - Kudi Yedamalanu Silvan

గొట్టిరి = చెడుగు యూదులు బెట్టు - కడు బాధలను మరియ - కొడు

Gottiri = Chedugu Yoodulu Bettu - Kadu Baadhalanu Mariya - Kodu

కోర్చుకొని వారి - యెడ దయ విడండయ్యె ||నపు డర్చ||

Korchukoni Vaari - Yeda Daya Vidandayye ||Napu Darcha||

Related Telugu Christian Songs