అనుకరించెద
Anukarincheda
అనుకరించెద - నే - ననుదినమును బాలుం డేసు = ననువుగాను జ్ఞానమునం
Anukarincheda - Ne - Nanudinamunu Baalun Desu = Nanuvugaanu Jnyaanamunan
- దును వయస్సునందును దే - వుని ప్రేమను మానవుల ద - యను బెరిగిన
- Dunu Vayassunandunu De - Vuni Premanu Maanavula Da - Yanu Berigina
బాలుండేసు ||ననుకరించెద||
Baalundesu ||Nanukarincheda||
1. పరదేశంబున వసించి - పరమాత్తుని మదిం దలంచి = దురితమును
1. Paradeshambuna Vasinchi - Paramaaththuni Madin Dalanchi = Durithamunu
జయించిన స - చ్చరింతుండైన యోసేపు ||ననుకరించెద||
Jayinchina Sa - Chcharinthundaina Yosepu ||Nanukarincheda||
2. తల్లి యానతి నెరవేర్చి - తమ్ముని కష్టములం దీర్చి = యెల్లకాలముండు కీర్తి
2. Thalli Yaanathi Neraverchi - Thammuni Kashtamulan Deerchi = Yellakaalamundu Keerthi
- నిల గడించిన మిర్యాము ||ననుకరించెద||
- Nila Gadinchina Miryaamu ||Nanukarincheda||
3. పాలు మరచినది మొదలు - ప్రభు సేవా సంపదలు = ఆలయమునం
3. Paalu Marachinadi Modalu - Prabhu Sevaa Sampadalu = Aalayamunan
బూనిన సు - బాలకుండు సమూయేలు ||ననుకరించెద||
Boonina Su - Baalakundu Samooyelu ||Nanukarincheda||
4. శత్రువులను బరిమార్చి - మిత్రులకు జయంబొనర్చి = స్తోత్రగీతములు
4. Shathruvulanu Barimaarchi - Mithrulaku Jayambonarchi = Sthothrageethamulu
రచించిన - సుందరుండౌ దావీదు ||ననుకరించెద||
Rachinchina - Sundarundau Daaveedu ||Nanukarincheda||
5. పరులకు న్యాయంబుం దీర్చం - బ్రజలకు క్షేమంబుం గూర్చం = పరమ
5. Parulaku Nyaayambun Deerchan - Brajalaku Kshemambun Goorchan = Parama
వివేకంబుం గోరి - ప్రభు నడిగిన సొలొమోను ||ననుకరించెద||
Vivekambun Gori - Prabhu Nadigina Solomonu ||Nanukarincheda||
6. యజమానుని కుష్టుం గాంచి - స్వజనుల దేవుని గురించి = నిజ సాక్ష్య
6. Yajamaanuni Kushtun Gaanchi - Svajanula Devuni Gurinchi = Nija Saakshya
మిడి సన్మా - నించిన హెబ్రీయ బాల ||ననుకరించెద||
Midi Sanmaa - Ninchina Hebreeya Baala ||Nanukarincheda||
7. అపవిత్ర రాజ భోజ - నాదుల విడి దైవ పూజం = గపట మింత లేక చేసి
7. Apavithra Raaja Bhoja - Naadula Vidi Daiva Poojan = Gapata Mintha Leka Chesi
- ఘనత నొందిన దానియేలు ||ననుకరించెద||
- Ghanatha Nondina Daaniyelu ||Nanukarincheda||
8. ప్రార్థన కూటమునం జేరి - ప్రత్యుత్తర మపుడె కోరి = సార్థకముగం బేతురుని
8. Praarthana Kootamunan Jeri - Prathyuththara Mapude Kori = Saarthakamugam Bethuruni
- సమాచార మిడిన రొదే ||ననుకరించెద||
- Samaachaara Midina Rode ||Nanukarincheda||
9. భక్తిభయములందుం బెరిగి - బహు ప్రదేశములను దిరిగి = శక్తి కొలంది
9. Bhakthibhayamulandun Berigi - Bahu Pradeshamulanu Dirigi = Shakthi Kolandi
సంఘ పరి - చర్య నొనర్చిన తిమోతి ||ననుకరించెద||
Sanggha Pari - Charya Nonarchina Thimothi ||Nanukarincheda||