ఐదు గాయము లొందినావా

Aidu Gaayamu Londinaavaa

Telugu by బేతాళ్ జాన్ • andhra-kraisthava-keerthanalu

ఐదు గాయము లొందినావా - నాకొర! కైదు - గాయము లొంది నావా =

Aidu Gaayamu Londinaavaa - Naakora! Kaidu - Gaayamu Londi Naavaa =

ఐదు గాయముల నా - యాత్మం దలంప నా కారాట మెచ్చినదే - నీ - మైదీగె

Aidu Gaayamula Naa - Yaathman Dalampa Naa Kaaraata Mechchinade - Nee - Maideege

నావంటి - మరుల పాల్దేసి - మరణ మొందితివి గదే ||1ఐదు||

Naavanti - Marula Paaldesi - Marana Mondithivi Gade ||1Aidu||

1... గార మైన నీ శ - రీర రక్త మిలను - ధారయై కారినదా - నా = నేరమా

1... Gaara Maina Nee Sha - Reera Raktha Milanu - Dhaarayai Kaarinadaa - Naa = Neramaa

యయ్యది - భారమై నీ పైని - ఘోరమై యొరిగినదా ||ఐదు||

Yayyadi - Bhaaramai Nee Paini - Ghoramai Yoriginadaa ||Aidu||

2. _ అందమౌ నీ తనువు - కంది రక్త స్వేద - బిందువులై రాలెనే - యీ =

2. _ Andamau Nee Thanuvu - Kandi Raktha Sveda - Binduvulai Raalene - Yee =

చంద మూహింప నా - డెందమ్ము భీతిచేం - గొందలమై తూలెనే ||ఐదు||

Chanda Moohimpa Naa - Dendammu Bheethichen - Gondalamai Thoolene ||Aidu||

3. _ ఎల్ల పాపము మోయు - అల్ల దేవుని గొట్టె - పిల్లవు నీవేగదా - నా =

3. _ Ella Paapamu Moyu - Alla Devuni Gotte - Pillavu Neevegadaa - Naa =

వల్లనా నీ కింత - యల్లాట పుట్టెనే - చెల్ల తాళునె నా యెద ||ఐదు||

Vallanaa Nee Kintha - Yallaata Puttene - Chella Thaalune Naa Yeda ||Aidu||

4. భంగమౌనట్టి దు - ష్పాపులం గావ నీ - ప్రాణ మర్పించితివా - యీ =

4. Bhanggamaunatti Du - Shpaapulan Gaava Nee - Praana Marpinchithivaa - Yee =

సంగతిం జూడ నీ - సాహస మింక నే - భంగి నీ జగతి మరవ ||నైదు||

Sanggathin Jooda Nee - Saahasa Mingka Ne - Bhanggi Nee Jagathi Marava ||Naidu||

5. _ ఆయాసమైన నీ - యాపదలెల్ల నే - నాలోచింపంగ నాత్మలో - నెడ =

5. _ Aayaasamaina Nee - Yaapadalella Ne - Naalochimpangga Naathmalo - Neda =

బాయక తద్దివ్య - పాదసరోజముల్‌ - భాసిల్లు నా యాత్మలో ||1నైదు||

Baayaka Thaddivya - Paadasarojamul - Bhaasillu Naa Yaathmalo ||1Naidu||

6. _ తల్లికైన మరి - తండ్రి కైన నన్న - దమ్ముల కైన లేదే - కన్న = పిల్లలకైన

6. _ Thallikaina Mari - Thandri Kaina Nanna - Dammula Kaina Lede - Kanna = Pillalakaina

నీ - ప్రేమం పోల్చుద - మన్నం - బృథివిలోం గానరాదే ||ఐదు||

Nee - Preman Polchuda - Mannan - Bruthivilon Gaanaraade ||Aidu||

7... ఈ ప్రీతి నీ యోర్మి - నీ మహాత్యం బిల - నెవ్వ రూహింతు రొగి -నో =

7... Ee Preethi Nee Yormi - Nee Mahaathyan Bila - Nevva Roohinthu Rogi -No =

హో ప్రభువా తద్ద - యోత్మట గాంభీర్య - మూహింప నీకే తగు _||నైదు||

Ho Prabhuvaa Thadda - Yothmata Gaambheerya - Moohimpa Neeke Thagu _||Naidu||

Related Telugu Christian Songs