ఆత్మలను సంపాదింపం నగు

Aathmalanu Sampaadimpan Nagu

Telugu by మల్లెల దావీదు • andhra-kraisthava-keerthanalu

ఆత్మలను సంపాదింపం నగు - ఆత్మ బలమున నిది చేయనగు = ఆత్మ

Aathmalanu Sampaadimpan Nagu - Aathma Balamuna Nidi Cheyanagu = Aathma

సంపాదనముకన్న - నక్షయానందము లేదన్న - యాత్మలను వెదకి రక్షింప

Sampaadanamukanna - Nakshayaanandamu Ledanna - Yaathmalanu Vedaki Rakshimpa

నాత్మల కాపరి యాన తిడి ||నాత్మలను||

Naathmala Kaapari Yaana Thidi ||Naathmalanu||

1. _ధనముకన్న నాత్మ సంపా - దనము మేలౌ దాని సంపా = దనముం గోరి

1. _Dhanamukanna Naathma Sampaa - Danamu Melau Daani Sampaa = Danamun Gori

మన రక్షకుండు - ధారపోసెను దన రక్తంబు ||నాత్మలను||

Mana Rakshakundu - Dhaaraposenu Dana Rakthambu ||Naathmalanu||

2. క్షణక్షణము నెందజో నశింప - నీవు సుఖింప = అణంకువతో

2. Kshanakshanamu Nendajo Nashimpa - Neevu Sukhimpa = Anangkuvatho

ననుదిన మొక యాత్మ - నైన రక్షింపంగ దయ రాదా || యాత్మలను||

Nanudina Moka Yaathma - Naina Rakshimpangga Daya Raadaa || Yaathmalanu||

3. పరుల యాత్మ విమోచనంబు - ప్రభువు కోరు బహుమానంబు = పరదుం

3. Parula Yaathma Vimochanambu - Prabhuvu Koru Bahumaanambu = Paradun

దౌ క్రీస్తును నీవెట్లు - వట్టి చేతులతో దర్శింతు ||నాత్మలను||

Dau Kreesthunu Neevetlu - Vatti Chethulatho Darshinthu ||Naathmalanu||

4. నీతిమార్గము ననుసరింప - నిత్యమును జక్కంగ వర్తింపం = పాతకులం

4. Neethimaargamu Nanusarimpa - Nithyamunu Jakkangga Varthimpan = Paathakulan

'ద్రిప్పెడు సద్భక్తుల్‌ - జ్యోతులట్లు బ్రకాశించెద రింక ||నాత్మలను||

'Drippedu Sadbhakthul - Jyothulatlu Brakaashincheda Ringka ||Naathmalanu||

5. జీతనాతంబులు లేవని - సిగ్గుపడకు మిది కాదని = ప్రీతితో నాత్మలను

5. Jeethanaathambulu Levani - Siggupadaku Midi Kaadani = Preethitho Naathmalanu

గడింప - నీతి మహిమ మకుటంబులునౌ ||నాత్మలను||

Gadimpa - Neethi Mahima Makutambulunau ||Naathmalanu||

6. నీ యమూల్య తరుణంబుల - నీ ప్రశస్తదానంబుల = వేయియేల నీ సర్వంబు

6. Nee Yamoolya Tharunambula - Nee Prashasthadaanambula = Veyiyela Nee Sarvambu

= విభుని సేవకు నీ వర్పించు ||మాత్మలను||

= Vibhuni Sevaku Nee Varpinchu ||Maathmalanu||

Related Telugu Christian Songs