ఆశీర్వాదము నీయుమ
Aasheervaadamu Neeyuma
ఆశీర్వాదము నీయుమ - మా పరమజనక - యాశీర్వాదము నీయుమ =
Aasheervaadamu Neeyuma - Maa Paramajanaka - Yaasheervaadamu Neeyuma =
ఆశలుదీరంగ - నాయు వొసంగుచు - వాసిగ కరుణను - వర్ధిల్ల బిడ్డకు
Aashaludeerangga - Naayu Vosangguchu - Vaasiga Karunanu - Vardhilla Biddaku
|||| ఆశీర్వాదము||
|||| Aasheervaadamu||
1. యేసు పెరిగిన యట్టులే - నీ దయయందు - ఈసు బిడ్డను పెంచుము =
1. Yesu Perigina Yattule - Nee Dayayandu - Eesu Biddanu Penchumu =
వాసిగ మనుజుల కరుణయందున బెరుగ - భాసుర వరమిచ్చి - బాగుగ
Vaasiga Manujula Karunayanduna Beruga - Bhaasura Varamichchi - Baaguga
బెంచుము || ఆశీర్వాదము||
Benchumu || Aasheervaadamu||
2. నెనరు మరగ మోషేను -నెమ్మదియందు - తనర బెంచినట్లుగ =ఘనముగ
2. Nenaru Maraga Moshenu -Nemmadiyandu - Thanara Benchinatluga =Ghanamuga
నీ శాంతి - సంతసములయందు - తనర నీ బిడ్డను - తగురీతి బెంచుము
Nee Shaanthi - Santhasamulayandu - Thanara Nee Biddanu - Thagureethi Benchumu
|||| ఆశీర్వాదము||
|||| Aasheervaadamu||
3. ఏ రీతి సమూయేలును - నీ సన్నిధిలో -నేపుగ బెంచితివో = యారీతి నీ
3. E Reethi Samooyelunu - Nee Sannidhilo -Nepuga Benchithivo = Yaareethi Nee
బిడ్డ నాత్మ స్నేహమునందు - కోరి బెంచుము ప్రభువ - కోర్కెలూరగ వేగ
Bidda Naathma Snehamunandu - Kori Benchumu Prabhuva - Korkelooraga Vega
|||| ఆశీర్వాదము||
|||| Aasheervaadamu||
4 సత్య విశ్వాసమునందు - చక్కగ బెరుగ - శక్తి యొసంగినడ్పుమా = సత్య
4 Sathya Vishvaasamunandu - Chakkaga Beruga - Shakthi Yosangginadpumaa = Sathya
వాక్యమునందు - సరగను - నిత్యము నీ కృప - నిచ్చి బ్రోవుమ ప్రభువ
Vaakyamunandu - Saraganu - Nithyamu Nee Krupa - Nichchi Brovuma Prabhuva
|||| ఆశీర్వాదము||
|||| Aasheervaadamu||
5. భక్తి ప్రేమల నీ బిడ్డ - బాగుగా బెరుగ - శక్తినీయ మా ప్రభువ = ముక్తి
5. Bhakthi Premala Nee Bidda - Baagugaa Beruga - Shakthineeya Maa Prabhuva = Mukthi
పథంబున ముద్దుగ నడువంగ - యుక్తజ్ఞానము నిచ్చి - యుద్ధరించుమ ప్రభువ
Pathambuna Mudduga Naduvangga - Yukthajnyaanamu Nichchi - Yuddharinchuma Prabhuva
|||| ఆశీర్వాదము|| -తూలూరి వ్రకాశము
|||| Aasheervaadamu|| -Thooloori Vrakaashamu