ఆశలన్ని

Aashalanni

Telugu by గిఫ్ట్సన్ దురై

నే తెరచు తలుపులు అన్ని, తరచుగా మూసితివి

Ne Therachu Thalupulu Anni, Tharachugaa Moosithivi

కోపించి పగనుంచినా నవ్వుతూ చూసితివి

Kopinchi Paganunchinaa Navvuthoo Choosithivi

నే తలచు మార్గములన్ని తరచుగా మూసితివి

Ne Thalachu Maargamulanni Tharachugaa Moosithivi

కన్నీళ్లతో దుఃఖించినా కౌగిలిలో దాచితివి

Kanneellatho Duhkhinchinaa Kougililo Daachithivi

మూయుటకు కారణం ఈ మూర్ఖునికి తెలిసినదే

Mooyutaku Kaaranam Ee Moorkhuniki Thelisinade

అడిగిన దానికంటే అధికమే పొందితినే

Adigina Daanikante Adhikame Pondithine

మూయుటకు కారణం ఇప్పుడే తెలిసినదే

Mooyutaku Kaaranam Ippude Thelisinade

అడిగిన దానికంటే ఎక్కువే పొందితినే

Adigina Daanikante Ekkuve Pondithine

నా చిన్న చిన్న ఆశలన్ని ఎరిగితివి కోరికలన్ని తీర్చితివి

Naa Chinna Chinna Aashalanni Erigithivi Korikalanni Theerchithivi

మూర్ఖునని నీవెరిగినా కౌగిలిలో బంధించితివి

Moorkhunani Neeveriginaa Kougililo Bandhinchitivi

ఆశలన్ని ఎరిగితివి కోరికలన్ని తీర్చితివి

Aashalanni Erigithivi Korikalanni Theerchithivi

మూఢుడై నేనుండగా ఎత్తుకుని నడిపించితివి

Moodudai Nenundagaa Etthukoni Nadipinchithivi

తండ్రులెవరైననూ చేపనడిగితే పామునిచ్చునా

Thandrulevarainanoo Chepanadigithe Paamunichchunaa

తండ్రీ నిన్ను నీ దయ మాత్రమే వేడితిని

Thandree Ninnu Nee Daya Maathrame Vedithini

నీకు వేరుగా నేను ఏదియు కోరలేను

Neeku Verugaa Nenu Ediyu Koralenu

ఆశలే నా ఊసై తాకనీ జనుల మనసును

Aashale Naa Oosai Thaakanee Janula Manasunu

తప్పుగా అడగను నీ చిత్తమే కోరెదను

Thappugaa Adaganu Nee Chitthame Koredanu

జీవముకు అర్ధము నీ వాక్యమే తెలిపెను

Jeevamuku Ardhamu Nee Vaakyame Thelipenu

మది లోతులన్ని నీవు మాత్రమే ఎరిగితివి

Madi Lothulanni Neevu Maathrame Erigithivi

కలవరములన్ని నీవే గ్రహియించితివి

Kalavaramulanni Neeve Grahiyinchitivi

ఏది ఏమైనగాని నీ సన్నిధి నేను చేరెదను

Edi Emainagaani Nee Sannidhi Nenu Cheredanu

ఎవరి ఎగతాళి మించినా నీ చిత్తమే చేయ సాగెదను

Evari Egathaali Minchinaa Nee Chitthame Cheya Saagedanu

ఎవ్వరికి తెలియని సంగతులు ఎరిగితివి

Evvariki Theliyani Sangathulu Erigithivi

లోతైన గాయము నీ ప్రేమతో మాన్పితివి ||నే తెరచు||

Lothaina Gaayamu Nee Prematho Maanpithivi ||Ne Terachu||

Related Telugu Christian Songs