ఆశ్చర్యమే మహాద్భుతమే
Aascharyame Mahaadbhuthame
ఆశ్చర్యమే మహాద్బుతమే – ఆనందసాగరము
Aashcharyame Mahaadbuthame – Aanandasaagaramu
ఎవరు మారినను మారనివాడు – నేడునిరంతరమున ప్రభువు
Evaru Maarinanu Maaranivaadu – Nedunirantharamuna Prabhuvu
శోధనలు ప్రవాహమువలె పెరిగి – ప్రాణాన్ని కృంగజేయును
Shodhanalu Pravaahamuvale Perigi – Praanaanni Krunggajeyunu
క్రీస్తు సే బండయే నా పాదములకు – ఆధారమాయెనుగా ||ఆశ్చ||
Kreesthu Se Bandaye Naa Paadamulaku – Aadhaaramaayenugaa ||Aashcha||
బేధములు పలువిమతములు పెను – గాలివలె వీచగా
Bedhamulu Paluvimathamulu Penu – Gaalivale Veechagaa
విశ్వాస నావను గురితప్పనీయక – యేసే లంగరాయెను ||ఆశ్చ||
Vishvaasa Naavanu Gurithappaneeyaka – Yese Langgaraayenu ||Aashcha||
నే నమ్మినవాడు తన నేత్రములను – నా మీదనే నిలిపి
Ne Namminavaadu Thana Nethramulanu – Naa Meedane Nilipi
నిరీక్షణతోను మహాధైర్యముతోను – కాచె నేటి వరకు ||ఆశ్చ||
Nireekshanathonu Mahaadhairyamuthonu – Kaache Neti Varaku ||Aashcha||
పూర్ణశుద్ధినొందిన పరిశుద్ధులు – పొందు బహుమతికి
Poornashuddhinondina Parishuddhalu – Pondu Bahumathiki
ప్రత్యేకపరచి నన్నును చేర్చెను – ప్రియుని స్వాస్థ్యముగా ||ఆశ్చ||
Prathyekaparachi Nannunu Cherchenu – Priyuni Svaasthyamugaa ||Aashcha||
ప్రభుని రాకడ దినమున మనము – ప్రియునివలె మారెదం
Prabhuni Raakada Dinamuna Manamu – Priyunivale Maaredan
మృత్యువు దు:ఖము కన్నీరు తొలగును – మహమహుని గాంచగా
Mruthyuvu Du:Khamu Kanneeru Tholagunu – Mahamahuni Gaanchagaa