ఆరాధించెద యేసు నీతో

Aaraadhincheda Yesu Neetho

Telugu • joyful-journey

ఆరంభించెద యేసూ నీతో ప్రతీదినం

Aarambhincheda Yesoo Neetho Pratheedinan

ఆనందించెద యేసూ నీలో ప్రతీ క్షణం

Aanandincheda Yesoo Neelo Prathee Kshanan

ఆస్వాదించెద నీమాటల మాధుర్యం – ఆరాధించెద నిన్నే నిత్యం

Aasvaadincheda Neemaatala Maadhuryan – Aaraadhincheda Ninne Nithyan

నీ సన్నిధిలో ప్రతి ఉదయం – ఆలించెద నీ మధుర స్వరం

Nee Sannidhilo Prathi Udayan – Aalincheda Nee Madhura Svaran

అరుణోదయమున నీ సహవాసం – నింపును నాలో నూతన ధైర్యం

Arunodayamuna Nee Sahavaasan – Nimpunu Naalo Noothana Dhairyan

నీ చిత్తముకై ప్రతి విషయం – అర్పించెద నీ కృపకోసం

Nee Chiththamukai Prathi Vishayan – Arpincheda Nee Krupakosan

వేకువ జామున నీ ముఖదర్శనం – పెంచును నాలో ఆత్మవిశ్వాసం

Vekuva Jaamuna Nee Mukhadarshanan – Penchunu Naalo Aathmavishvaasan

నా పెదవులతో ప్రతి నిమిషం – స్తుతియించెద నీ ఘన నామం

Naa Pedavulatho Prathi Nimishan – Sthuthiyincheda Nee Ghana Naaman

దినప్రారంభమున నీ ప్రియధ్యానం – కాల్చును నాలో అహము సర్వం

Dinapraarambhamuna Nee Priyadhyaanan – Kaalchunu Naalo Ahamu Sarvang

Related Telugu Christian Songs