ఆరాధనా స్తుతి పాత్రుడ
Aaraadhanaa Sthuthi Paathruda
ఆరాధనా - స్తుతి పాత్రుడ యేసయ్యా - ఏరీతి నిను నే ప్రస్తుతించెదను
Aaraadhanaa - Sthuthi Paathruda Yesayyaa - Ereethi Ninu Ne Prasthuthinchedanu
నీరాజనములతో నీదు ప్రేమన్ - నిరతము స్తుతించెద నీనామమున్
Neeraajanamulatho Needu Preman - Nirathamu Sthuthincheda Neenaamamun
1. నా పాప భారం సిలువలో మోసి - విడుదల నిచ్చితివే
1. Naa Paapa Bhaaram Siluvalo Mosi - Vidudala Nichchithive
నాశాపమంత తొలగించితివి - శుద్దుని జేసితివే
Naashaapamantha Tholaginchithivi - Shudduni Jesithive
రక్షణ నీవే రాజ్యము నీదే - ప్రభువా దేవా నీజాలి కృపకై
Rakshana Neeve Raajyamu Neede - Prabhuvaa Devaa Neejaali Krupakai
నిరతము స్తుతించెద - నీ నామమున్
Nirathamu Sthuthincheda - Nee Naamamun
2. నూతన జీవం - నూతన బలము - నూతన మనసిచ్చావే
2. Noothana Jeevam - Noothana Balamu - Noothana Manasichchaave
అనుదిన నూతన వాత్సల్యముతో - దినదినము కరుణించావే
Anudina Noothana Vaathsalyamutho - Dinadinamu Karuninchaave
జీవము నీవే - జయమునీవే - దేవుని తనయా నీత్యాగం కొరకై
Jeevamu Neeve - Jayamuneeve - Devuni Thanayaa Neethyaagam Korakai
నిరతము స్తుతించెద - నీనామమున్
Nirathamu Sthuthincheda - Neenaamamun
3. సాతాను క్రియలన్ని - లయపరిచావు - చీకటి తొలగించావే
3. Saathaanu Kriyalanni - Layaparichaavu - Cheekati Tholaginchaave
మరణపు ముల్లును విరిచావు నీవు - కాడిని ఖండించావే
Maranapu Mullunu Virichaavu Neevu - Kaadini Khandinchaave
వాక్యము నీవే - జయము నీదే - దేవుని తనయా నీత్యాగం కొరకై
Vaakyamu Neeve - Jayamu Neede - Devuni Thanayaa Neethyaagam Korakai
నిరతము స్తుతించెద - నీనామమున్
Nirathamu Sthuthincheda - Neenaamamun
4. ఆత్మతో నింపి - ఆకలి తీర్చి - ఆదరణిచ్చితివే
4. Aathmatho Nimpi - Aakali Theerchi - Aadaranichchithive
అభిషేకమిచ్చి - ఆశను తీర్చి - ఆత్మల నిచ్చితివే
Abhishekamichchi - Aashanu Theerchi - Aathmala Nichchithive
ఆత్మయునీవే - సత్యము నీవే - ఆత్మల కాపరి నీకాపుదలకై
Aathmayuneeve - Sathyamu Neeve - Aathmala Kaapari Neekaapudalakai
నిరతము స్తుతించెద - నీ నామమున్
Nirathamu Sthuthincheda - Nee Naamamun