ఆనంద మగు ముక్తి
Aananda Magu Mukthi
ఆనంద మగు ముక్తి - యే నా మందిరము = జ్ఞాని మానుగం జూచు -
Aananda Magu Mukthi - Ye Naa Mandiramu = Gnaani Maanugan Joochu -
దాని సుందరము ॥ఆనందమగు॥
Daani Sundaramu ॥Aanandamagu॥
1. పరదేశివలె దేహా - వరణమం దుందున్ - ధరణి కాననముగా - దర్శించు
1. Paradeshivale Dehaa - Varanaman Dundun - Dharani Kaananamugaa - Darshinchu
చుందున్ - నెరి దుఃఖసుఖములు - సరిగా భావింతున్ = పరిశుద్ద్ధాత్ముని వేం
Chundun - Neri Duhkhasukhamulu - Sarigaa Bhaavinthun = Parishudddhaathmuni Ven
డి - పరితృప్తి నుండు ॥నానంద మగు॥
Di - Parithrupthi Nundu ॥Naananda Magu॥
2. బహు శోధనలు నాపై - బడి వచ్చునపుడు - నహితాంధతమము న -
2. Bahu Shodhanalu Naapai - Badi Vachchunapudu - Nahithaandhathamamu Na -
న్నడ్డుకొన్నపుడు - నిహబాధ లన్నిన - న్నెదిరించినపుడు = నహహ యేసునివల్ల
Nnaddukonnapudu - Nihabaadha Lannina - Nnedirinchinapudu = Nahaha Yesunivalla
- నమృతుండ నెపుడు ॥నానంద మగు॥
- Namruthunda Nepudu ॥Naananda Magu॥
3. ముందు నా మనసు దే-వుని కప్పగింతు-నందరి నస్మత్తు-ల్యముగాయ
3. Mundu Naa Manasu De-Vuni Kappaginthu-Nandari Nasmaththu-Lyamugaaya
ప్రేమింతున్ - సందేహ రాహిత్య - సరణిలో నిల్తుం = పొందం బోయెడి ముక్తి
Preminthun - Sandeha Raahithya - Saranilo Nilthun = Pondan Boyedi Mukthi
- భువి యందె గాంతు ॥నానంద మగు॥
- Bhuvi Yande Gaanthu ॥Naananda Magu॥